Dinesh Karthik: ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్‌ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ

ఈ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) సరికొత్త అవతారంలో ఆర్సీబీకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 

Published : 01 Jul 2024 14:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గ్రేట్‌ ఫినిషర్‌గా పేరొందిన దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన జట్టును గెలిపించిన డీకేకు ఆర్సీబీ కీలక బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ (2025) నుంచి బెంగళూరుకు దినేశ్‌ కార్తిక్‌ బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ‘‘మా వికెట్‌ కీపర్‌కు ఘన స్వాగతం. దినేశ్ కార్తీక్ సరికొత్త అవతారంతో ఆర్సీబీకి తిరిగివచ్చాడు. డీకే ఆర్సీబీ పురుషుల జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌గా వ్యవహరిస్తాడు. క్రికెట్ నుండి అతడిని వేరు చేయొచ్చు. కానీ, క్రికెట్‌ అతడికి దూరం కాదు’’ అని ఆర్సీబీ ఎక్స్‌ (ట్విటర్)లో పోస్టు పెట్టింది. 

2024 ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమిచింది. ఆ మ్యాచ్‌ అయిన వెంటనే కార్తీక్‌ ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. అతను ఐపీఎల్‌లో బెంగళూరుతో పాటు కోల్‌కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2024 సీజన్‌లో కార్తీక్‌ 15 మ్యాచ్‌లాడి 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మొత్తం 257 మ్యాచ్‌లాడి 4,842 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కొన్ని రోజులకే అన్నిరకాల పోటీ క్రికెట్‌కు కార్తిక్‌ గుడ్‌బై చెప్పేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు