Jasprit Bumrah: బుమ్రా నాకంటే 1000 రెట్లు బెటర్: భారత దిగ్గజ క్రికెటర్

భారత స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ ప్రదర్శనపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. తన కంటే చాలా రెట్లు బెటర్ అంటూ కొనియాడటం గమనార్హం.

Published : 27 Jun 2024 18:23 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు తొలిసారి వన్డే వరల్డ్‌ కప్‌ను అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. ఈ టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం ఆల్‌రౌండర్‌గా జట్టులో కీలక పాత్ర పోషించాడు. అయితే, తన కంటే అద్భుతమైన బౌలర్‌ ఉన్నాడని.. అతడే జస్‌ప్రీత్ బుమ్రాగా కపిల్ అభివర్ణించాడు. టీ20 ప్రపంచ కప్‌లో బుమ్రా బౌలింగ్‌ను చూస్తుంటే చాలా ముచ్చటేసిందని వ్యాఖ్యానించాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని అభినందించాడు. ప్రస్తుత జట్టుపైనా ప్రశంసల వర్షం కురిపించాడు. 

‘‘బుమ్రా నాకంటే వెయ్యి రెట్లు అద్భుతమైన బౌలర్. ఇప్పుడున్న క్రికెటర్లలో చాలా మంది మంచి నైపుణ్యం కలిగిన వారే. మాకు అనుభవం ఉంది. వారు ఇంకా మెరుగవుతారు. ప్రస్తుత జట్టులో చాలా మంది నాణ్యమైన క్రికెట్‌ ఆడటంతోపాటు ఫిట్‌నెస్‌ విషయంలో చాలా ముందున్నారు. తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాగే కొనసాగితే గొప్ప క్రికెటర్లుగా కావడం పెద్ద కష్టమేం కాదు’’ అని కపిల్ వ్యాఖ్యానించాడు. 

మేం కూడా దూకుడుగానే ఆడతాం: ఇంగ్లాండ్ కెప్టెన్

ఈసారి ప్రపంచ కప్‌లో భారత్‌ దూకుడుగా ఆడుతోందని.. తాము కూడా అదే స్థాయిలో ఆడేందుకు ప్రయత్నిస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ‘‘టీమ్‌ఇండియా వంటి జట్టుతో తలపడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉంటాం. తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా యాక్టివ్‌గా ఉండాల్సి ఉంది. గత పొట్టి కప్‌లో మేం 10 వికెట్ల తేడాతో విజయం సాధించాం. ఆ ఫీట్‌ను మరిచిపోలేం. ఈసారి కూడా ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం’’ అని జోస్ బట్లర్ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు