IND vs SA: ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్

రాహుల్‌ ద్రవిడ్‌ కోసం కప్‌ గెలవాలనే ట్రెండింగ్‌పై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 29 Jun 2024 16:13 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంతా #DoItForDravid క్యాంపెయిన్‌ నడుస్తోంది.  టీ20 వరల్డ్‌ కప్‌ 2024 (T20 World Cup 2024) భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ చివరి మెగా టోర్నీ ఇది. గతేడాది టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరినా విజేతగా నిలవలేకపోయింది. ఇప్పుడు పొట్టి కప్‌ ఫైనల్‌కు చేరడంతో ఈసారైనా ద్రవిడ్ కోసం కప్‌ గెలవాలనే ట్రెండింగ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి వార్తలపై ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. తాను అస్సలు ఇలాంటివి నమ్మనని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో ద్రవిడ్‌పై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి ట్రెండ్‌ భారత జట్టు వాతావరణాన్ని కలుషితం చేస్తుందని వ్యాఖ్యానించాడు. 

‘‘కేవలం ఒక్కరిని ఉద్దేశించి కథనాలు సృష్టించడం సరైంది కాదు. క్రీడాస్ఫూర్తిని దెబ్బతీస్తుంది. జట్టు వాతావరణం చెడిపోయే ప్రమాదం లేకపోలేదు. రాహుల్ ద్రవిడ్‌ ఇలాంటివాటిని కొట్టిపడేస్తాడని నాకు తెలుసు. ద్రవిడ్ క్లాసిక్‌ పర్సన్. కమాన్‌ ఇండియా మరోసారి అవకాశం వచ్చింది. తీవ్రంగా పోరాడండి’’ అని అశ్విన్‌ (Ashwin) వ్యాఖ్యానించాడు. 

అర్ష్‌దీప్‌పై సిద్ధూ సరదా కామెంట్

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత టెయిలెండర్ అర్ష్‌దీప్‌ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఫరూఖి బౌలింగ్‌లో స్టంప్స్‌ను వదిలేసి మరీ ఆడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని  ఉదహరిస్తూ.. ‘‘100 శాతం ఆత్మవిశ్వాసం.. నైపుణ్యం 0 శాతం’’ అంటూ భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌ సిద్ధూ సరదాగా కామెంట్‌ చేశాడు. అయితే, టీ20 ప్రపంచ కప్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌ నైపుణ్యాలను మాత్రం ఆకాశానికెత్తేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని