- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
SA vs AFG: చేతులెత్తేసిన అఫ్గాన్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా లక్ష్యం 57
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో సెమీస్-1 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు ఆలౌటయ్యారు.
ట్రినిడాడ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న సెమీఫైనల్-1 మ్యాచ్‌లో అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇప్పటివరకు అసాధారణ ప్రతిభ కనబరిచిన అఫ్గాన్ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆలౌటయ్యారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (10) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుసగా వికెట్లు పడగొడుతూ అఫ్గాన్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్లు గుర్బాజ్ (0), జర్దాన్ (2), తొలి డౌన్లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) పూర్తిగా విఫలమయ్యారు.
ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒమర్జాయ్ ప్రయత్నించాడు. కానీ, నోకియా బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ (8) కూడా ఆకట్టుకోలేక పోయాడు. నబీ (0), జనత్ (8), నూర్ ఆహ్మద్ (0), నవీనుల్ హక్ (2) ప్రభావం చూపలేకపోయారు. ఫరూకీ (2*) నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, షంసీ చెరో 3 వికెట్లు తీయగా.. రబాడా, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
టెస్టు క్రికెట్లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్‌లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్‌ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్‌లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్‌బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
-
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్‌లో ఐదుగురు జవాన్లు గల్లంతు
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్