Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి

Shubman Gill: క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను తాను పెళ్లి చేసుకోనున్నట్లు వస్తున్న వార్తలపై టీవీ నటి రిధిమా పండిత్‌ స్పష్టనిచ్చింది.

Published : 01 Jun 2024 13:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీవీ నటి రిధిమా పండిత్‌ (Ridhima Pandit)తో అతడి పెళ్లి జరగనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన నటి వదంతుల (Wedding Rumours)పై క్లారిటీ ఇచ్చారు. ఆ క్రికెటర్‌తో ఎలాంటి పరిచయం లేదన్నారు.

టీవీ నటి రిధిమా, గిల్‌ (Shubman Gill) గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, ఈ ఏడాది డిసెంబరులో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ పోస్ట్‌లు వైరల్‌ అయినప్పటి నుంచి నటికి విపరీతమైన ఫోన్‌ కాల్స్ వచ్చాయట. దీంతో ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘ఈ ఉదయం నుంచి జర్నలిస్టుల నుంచి అనేక కాల్స్‌ వచ్చాయి. ఇలా ఎప్పుడూ జరగలేదు. నా వివాహం గురించి చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు. నా జీవితంలో ఏదైనా జరిగితే స్వయంగా ప్రకటిస్తా’’ అని రాసుకొచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ దీని గురించి స్పందించింది. ‘‘కొందరు కావాలనే ఈ కథను అల్లి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వ్యక్తిగతంగా శుభ్‌మన్‌ గిల్‌ (Cricketer Shubman Gill)తో నాకు ఎలాంటి పరిచయం లేదు. నిన్న ఉదయం నుంచి శుభాకాంక్షల మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. విసిగెత్తిపోయి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టా’ అని తెలిపింది. ప్రస్తుతానికి తాను సింగిల్‌ అంటూ పెళ్లి వార్తలను కొట్టిపారేసింది. శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లి, ప్రేమ గురించి గతంలోనూ పలుమార్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌ టీవీ షో ‘బహు హమారీ రజనీకాంత్‌’తో రిధిమా పండిత్‌ (TV Actress Ridhima Pandit) బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా పాపులరిటీ సంపాదించుకుంది. ఖత్రోన్‌ కీ ఖిలాడీ, బిగ్‌బాస్‌ ఓటీటీ తదితర రియాల్టీ షోస్‌లో మెరిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు