ప్రపంచ రికార్డు.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు!

ఒకే ఓవర్‌లో 43 పరుగులు సాధించి ఓ బ్యాటర్‌ రికార్డు సృష్టించాడు.

Published : 26 Jun 2024 20:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 43 రన్స్‌.. ఒక ఇన్నింగ్స్‌లో బ్యాటర్‌ చేసిన స్కోరు కాదు ఇది. కేవలం ఒకే ఓవర్‌లో సాధించిన పరుగులు. ఇది ప్రపంచ రికార్డు కూడా. లీసెస్టర్‌షైర్‌, సస్సెక్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇలా ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చి ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా లీసెస్టర్‌షైర్‌ తరఫున నంబర్‌ 8 స్థానంలో లూయిస్‌ కింబర్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. 59వ ఓవర్‌ వేసేందుకు సస్సెక్స్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌ బంతినందుకున్నాడు.

అతడి బౌలింగ్‌లో కింబర్‌ సిక్స్‌లతో చెలరేగాడు. దీంతో బౌలర్‌ బంతిపై నియంత్రణ కోల్పోయాడు. మూడు నోబాల్స్‌ను వేశాడు. ఈ ఓవర్‌లో బ్యాటర్‌ మొత్తం రెండు సిక్స్‌లు, 6 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈసీబీ డొమెస్టిక్‌ ఛాంపియన్‌షిప్‌లో నోబాల్‌కు రెండు పరుగులు అదనంగా ఇస్తారు. ఇలా మొత్తం 43 పరుగులు ఒకే ఓవర్‌లో వచ్చాయి. ఆ ఓవర్‌లో వచ్చిన పరుగులు ఇలా ఉన్నాయి.. 6,6nb,4,6,4,6nb,4,6nb,1. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 134 ఏళ్ల చరిత్రలో ఒకే ఓవర్‌లో ఇన్ని పరుగులు కొట్టడం ఇదే రికార్డు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని