Team India: టీమ్‌ఇండియాకు రూ.125 కోట్ల బహుమతి ప్రకటించిన బీసీసీఐ

టీ20 ప్రపంచ కప్‌ 2024ను సాధించిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ నగదు ప్రకటించింది.

Updated : 30 Jun 2024 20:54 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ 2024ను సాధించిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ బహుమతిని ప్రకటించింది. రూ.125 కోట్ల నగదు బహుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రకటన చేశారు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి పొట్టికప్‌ను సొంతం చేసుకుంది. 2013 తర్వాత టీమ్‌ఇండియా ఐసీసీ ట్రోఫీ నెగ్గడం ఇదే తొలిసారి. దీంతో పొట్టి కప్‌ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ మొత్తాన్ని ప్రకటించింది. 

‘‘ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024ను గెలిచినందుకుగాను టీమ్ఇండియాకు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. టోర్నమెంట్ ఆసాంతం జట్టు అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అద్భుతమైన విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అభినందనలు’’ అని జై షా ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని