Kondeti Chitti Babu: వైకాపాకు షాక్‌.. ఆ పార్టీని వీడిన మరో ఎమ్మెల్యే

వైకాపా (YSRCP)కు మరో షాక్‌ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీని వీడారు.

Updated : 13 Apr 2024 14:15 IST

ముద్దనూరు: వైకాపా (YSRCP)కు మరో షాక్‌ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో టికెట్‌ను ఆయన స్థానంలో విప్పర్తి వేణుగోపాల్‌కు వైకాపా కేటాయించింది. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న చిట్టిబాబు నేడు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని