Yanamala: రెవెన్యూ రికవరీ యాక్ట్‌తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.

Updated : 02 Jul 2024 13:38 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తన పరిశీలనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ (ఆర్‌ఆర్‌ యాక్ట్‌) లేదా ప్రత్యేకమైన చట్టంతో రాబట్టాలని సూచించారు. గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పురోగతి చర్యలు అభినందనీయమని యనమల కొనియాడారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను ఆయన సూచించారు. ఎన్నికల మ్యానిఫెస్టో అమలుకు తోడ్పాటు ఇవ్వటంతోపాటు రాష్ట్ర ఖజానా, ఆర్థిక ఆరోగ్యాన్ని ఈ సూచనలు మెరుగుపరుస్తాయని యనమల అభిప్రాయపడ్డారు.  

సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే బిల్లుల చెల్లింపులు చేయాలి

పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడం, సహేతుకమైన స్థిర రుణాలు, ఇప్పుడు ఉన్నదాని కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ తదితర అంశాలపై కేంద్రాన్ని అభ్యర్థించాలని యనమల సిఫార్సు చేశారు. వేస్‌ అండ్ మీన్స్, ఓడీని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ఆదాయ వ్యయాల తగ్గించుకోవాలని, సంక్షేమ పథకాలకు అర్హులే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలని, ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని యనమల తన లేఖలో పేర్కొన్నారు. సమృద్ధిగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం ద్వారా లోటు ప్రస్తుతం నియంత్రించి.. రాబోయే సంవత్సరాల్లో తగ్గించాలని సూచించారు. బిల్లుల చెల్లింపులు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా మాత్రమే చేయాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పురోగతి, శ్రేయస్సు కోసం అనుకూల వాతావరణాన్ని వేగవంతం చేసేందుకు ప్రబలంగా ఉన్న అవినీతిని నిర్మూలించాలని పేర్కొన్నారు. చంద్రబాబు దార్శనిక నాయకత్వం, సుపరిపాలన పట్ల నిబద్ధతతో రాష్ట్రం సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని యనమల ఆకాంక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు