Warangal: రాకేశ్‌ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లలో మృతిచెందిన వరంగల్‌ జిల్లా యువకుడు రాకేశ్‌ మృతదేహంతో

Published : 18 Jun 2022 11:31 IST

వరంగల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లలో మృతిచెందిన వరంగల్‌ జిల్లా యువకుడు రాకేశ్‌ మృతదేహంతో భారీ ర్యాలీ చేపట్టారు. రాకేశ్‌ మృతదేహం ఉన్న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి నుంచి నర్సంపేట వరకు ఈ అంతిమ యాత్ర సాగింది. ర్యాలీలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, తెరాస శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరంగల్‌ పట్టణ పరిధిలోని పోచంమైదాన్ కూడలి వద్ద పలువురు ఆందోళనకారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని