Revanth Reddy: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ అభివృద్ధి: సీఎం రేవంత్‌

వరంగల్‌ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Published : 29 Jun 2024 17:47 IST

వరంగల్‌: వరంగల్‌ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. వరంగల్‌ పర్యటనలో ఉన్న ఆయన నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్‌ సిటీగా తీర్చిదిద్దటానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు ఉండేలా చూడాలన్నారు. ఓఆర్‌ఆర్‌ నుంచి టెక్స్‌టైల్‌ పార్కును అనుసంధానించాలని చెప్పారు. స్మార్ట్‌సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన.. డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని