RamMohan Naidu: పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలి: రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిని మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో బట్టలూడదీసి అవమానించడం దారుణమని తెదేపా తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మండిపడ్డారు.

Published : 23 Oct 2023 16:41 IST

అమరావతి: శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిని మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో దుస్తులు విప్పించి అవమానించడం దారుణమని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి కుప్పం వరకు సైకిల్‌ యాత్ర చేస్తుంటే.. అడ్డుకోవడానికి పుంగనూరులో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ అరాచకాల వెనకున్న పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ దురాగతంపై ఉత్తరాంధ్ర వైకాపా నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని రామ్మోహన్‌ నిలదీశారు.

‘‘ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన బీసీలను అవమానిస్తే సీఎం జగన్‌ స్పందించరా?ఉత్తరాంధ్రులను అవమానించిన వైకాపా నేతలు రాజధానితో ఉద్ధరిస్తామంటే ఎలా నమ్మాలి? వైకాపా రౌడీ రాజకీయానికి భయపడే.. 2014 ఎన్నికల్లో విశాఖ ప్రజలు విజయమ్మను ఓడించారు. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి పార్లమెంట్‌లో నన్ను అవమానించారు. ఇప్పుడు ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో అవమానించారు’’ అని రామ్మోహన్‌ నాయుడు మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని