TDP: ప్రజలకు ముఖం చూపించుకోలేక జగన్‌ కుయుక్తులు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి

ప్రతిపక్ష హోదా కోసం వైకాపా అధ్యక్షుడు జగన్ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి ఎద్దేవా చేశారు.

Updated : 26 Jun 2024 15:11 IST

అమరావతి: ప్రతిపక్ష హోదా కోసం వైకాపా అధ్యక్షుడు జగన్ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం హేయమైన చర్య అన్నారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ఆ హోదా వస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేక కుయుక్తులకు తెరలేపారని విమర్శించారు. స్పీకర్ ఎన్నిక రోజు వైకాపా ఎమ్మెల్యేల్లో ఒక్కరూ అసెంబ్లీకి రాలేదన్నారు. 

‘‘ఆరుగురు శాసన సభ్యులను పీకేస్తే తెదేపా ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని మీరన్న మాటలు మరిచిపోయారా జగన్?. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలోకి వస్తారా? ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు? మీ నియోజకవర్గ  ప్రజల సమస్యలు మీకు పట్టవా? ఇకనైనా జగన్ అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలి. ఆయన పాలనలో నష్టపోని వ్యక్తి లేడు. ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పడంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ కొత్త నాటకాలకు తెరలేపారు’’ అని మాధవీరెడ్డి మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు