TGPSC: టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన.. పలువురి అరెస్టు

టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు.

Updated : 05 Jul 2024 13:22 IST

హైదరాబాద్‌: టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి నేతలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన వీరు.. ప్రధానంగా మూడు డిమాండ్లు చేస్తున్నారు. గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్టోబర్‌లో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని