Somireddy: రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటా: సోమిరెడ్డి

కృష్ణపట్నం నుంచి కంటైనర్‌ పోర్టును తరలిపోనివ్వబోమని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. కంటైనర్‌ పోర్టు తరలింపుతో పది వేల మంది ఉపాధి కోల్పోతారన్నారు.

Updated : 28 Jun 2024 20:20 IST

నెల్లూరు: కృష్ణపట్నం నుంచి కంటైనర్‌ పోర్టును తరలిపోనివ్వబోమని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. కంటైనర్‌ పోర్టు తరలింపుతో పది వేల మంది ఉపాధి కోల్పోతారన్నారు. ఎన్డీయే కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని.. రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే ఆదానీ కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు.

కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. టెర్మినల్‌ పనులు ఆగిపోతే ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి పోర్టుపై ఆధారపడ్డ కార్మికులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారంటూ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో తరలిపోయిన కంటైనర్‌ పోర్టు ప్రాంతాన్ని అఖిలపక్షం నేతలు శుక్రవారం పరిశీలించారు. కంటైనర్‌ పోర్టును పునరుద్ధరించాలని కోరుతూ పోర్టు సీఈవోకు నేతలు వినతిపత్రం అందజేశారు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని