Peddireddy: పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్

వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి షాక్‌ తగిలింది.

Updated : 27 Jun 2024 15:54 IST

పుంగనూరు: వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి షాక్‌ తగిలింది. సొంత నియోజవర్గం పుంగనూరులో మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీంబాషాతో పాటు 11 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక తెదేపా ఇన్‌ఛార్జ్‌ చల్లా బాబు ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. త్వరలో వారంతా తెదేపాలో చేరనున్నారు. ఈ సందర్భంగా అలీంబాషా మాట్లాడుతూ పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమే ఉంటుందని.. అధికారం ఉండదని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు