Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌ నివాసం వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు

మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద భద్రతలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది

Published : 01 Jul 2024 23:03 IST

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద భద్రతలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. తాడేపల్లిలోని జగన్‌ ఇంటివద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించింది. భద్రతలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్‌ బొలార్డ్స్‌, టైర్ కిల్లర్స్‌ను తొలగించింది. జగన్‌ ఇంటికి పార్క్‌ విల్లాస్‌ ద్వారా వెళ్లే మార్గంలో ఉన్న చెక్‌పోస్టులను సైతం అధికారులు తొలగించారు.

YS Jagan: జగన్‌ రక్షణకే 986 మంది

అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ భద్రతలో ఏకంగా 986 మంది సిబ్బంది ఉన్నారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సిబ్బందితోపాటు ఆయన కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు.. ప్యాలెస్‌ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ (కంచె), బుల్లెట్‌ ప్రూఫ్‌ క్రూయిజర్‌ వాహనాలు అందుబాటులో ఉండేవి. తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూనే ఎప్పుడూ 310 మంది ఆయన రక్షణలో ఉండేవారు. మాజీ సీఎం అయ్యాక కూడా ఈ తరహా భారీ భద్రత కొనసాగుతుండడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద భద్రతలో మార్పులకు ఉపక్రమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు