Ramprasad Reddy: మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి చొరవ.. ఆందోళన విరమించిన అద్దె బస్సుల యజమానులు

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ డిపోలో అద్దె బస్సుల యజమానుల సమస్యపై మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి స్పందించారు.

Published : 03 Jul 2024 14:54 IST

జగ్గయ్యపేట: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్ డిపోలో అద్దె బస్సుల యజమానులు బుధవారం ఆందోళనకు దిగారు. సమాచారం లేకుండా టైమింగ్స్ మార్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉండే సమయాలు ఇవ్వాలని యజమానులు డిమాండ్ చేశారు. సంక్రాంతి నుంచి బకాయిలు చెల్లించలేదని, సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. 33 అద్దె బస్సులను నిలిపివేయడంతో విజయవాడ-జగ్గయ్యపేట మధ్య పలు సర్వీసులు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట వెళ్లేందుకు సరిపడా బస్సుల్లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై రవాణాశాఖమంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి వెంటనే స్పందించారు. యజమానులతో చర్చలు జరిపి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌).. అద్దె బస్సుల యజమానులతో మాట్లాడారు. ప్రభుత్వ హామీతో వారు ఆందోళన విరమించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు