Ramprasad Reddy: ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా మంచి సేవలందిస్తాం: ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

వైకాపా హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 26 Jun 2024 14:26 IST

కుప్పం: వైకాపా హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదన్నారు. లీజుల పేరుతో ఆర్టీసీ భూములను వైకాపా నేతలు చెరబట్టారని ఆరోపించారు. లీజుకు తీసుకున్న భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఛార్జీల భారం పెంచకుండానే.. బస్సు సర్వీసులు పెంచి మంచి సేవలందిస్తామని పేర్కొన్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ అక్రమాలన్నింటినీ వెలికితీస్తామని తెలిపారు. ప్రజల సొమ్ము తిన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని రామ్‌ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని