Ramachandra Yadav: భారత చైతన్య యువజన పార్టీ.. ఏపీలో నూతన రాజకీయ వేదిక

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్రయాదవ్‌ నూతన రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు.

Updated : 23 Jul 2023 20:51 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ నూతన రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. ‘భారత చైతన్య యువజన పార్టీ’(బీసీవై)పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. గుంటూరు శివారులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ పేరును రామచంద్రయాదవ్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంతో బీసీవై పార్టీ స్థాపించినట్టు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే .. కొత్త రాజకీయ ప్రస్థానం జరగాలన్నారు. వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయన్నారు. జగన్‌ పాలన పురాణాల్లో రాక్షసుల్ని గుర్తు చేస్తోందని విమర్శించారు. వైకాపా పెద్ద ల నుంచి కార్యకర్తల వరకు అందరూ దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ప్రైవేటు భూములు, ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ సభకు అంబేడ్కర్‌ మనువడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌, సూరజ్‌ మండల్‌, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రామచంద్రయాదవ్‌ అభిమానులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు