Rajasthan: ఆడిన మాట తప్పని రాజస్థాన్‌ మంత్రి కిరోడిలాల్‌

భాజపా సీనియర్‌ నేత, రాజస్థాన్‌ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్‌ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ ఆమోదించలేదు.

Published : 05 Jul 2024 09:36 IST

సవాల్‌ మేరకు పదవికి రాజీనామా 

జైపుర్‌: భాజపా సీనియర్‌ నేత, రాజస్థాన్‌ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్‌ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ ఆమోదించలేదు. తనకు బాధ్యత అప్పగించిన ఏడు లోక్‌సభ స్థానాల్లో పార్టీ ఏ ఒక్క స్థానంలో ఓడిపోయినా మంత్రి పదవిని వీడతానని ఎన్నికల ముందు మీనా సవాల్‌ చేశారు. ఆయన సొంతపట్టణం దౌసా సహా బాధ్యత తీసుకున్న స్థానాల్లో నాలుగుచోట్ల కమలదళం ఓటమి పాలైంది. దీంతో చెప్పిన మాట ప్రకారం ఆయన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం దిల్లీకి రావాలంటూ పార్టీ అధిష్ఠానం తనను పిలిచిందని, తన రాజీనామాపై వారిని ఒప్పిస్తానని మీనా తెలిపారు. పదవిని వీడటమన్నది తన నైతిక బాధ్యతని పేర్కొన్నారు. ప్రజల్లో తనకు గల విశ్వసనీయత చెక్కు చెదరకూడదని భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 14 ఎంపీ స్థానాలను కాషాయ పార్టీ గెలుచుకోగలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని