NEET Row: ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ

NEET Row|  కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నీట్‌ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Published : 02 Jul 2024 17:42 IST

NEET Row| దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. నీట్‌ వ్యవహారం(NEET Row)పై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగేలా చూడాలని కోరారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నీట్‌ అంశంపై చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే సముచితంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జూన్‌ 28న నీట్‌ వ్యవహారంపై  పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించాలని విపక్షాలు కోరగా.. అందుకు నిరాకరించారన్నారు. సోమవారం కూడా ఇదే అంశంపై మళ్లీ చర్చకు అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్‌ గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని స్పీకర్‌ విపక్షాలకు హామీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 

మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్‌ యాదవ్

నీట్‌ ఆశావహుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్‌.. ఈ వ్యవహారంపై నిర్మాణాత్మకంగా అడుగులు వేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. నీట్ పరీక్షపై తక్షణమే దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఇది మన ఉన్నత విద్యా వ్యవస్థలో కుళ్లును బహిర్గతం చేసిందన్నారు. గత ఏడేళ్లలో 70కి పైగా పేపర్‌ లీకేజీలు జరిగాయని, వీటితో 2కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు ధైర్యంగా, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటారని మనవైపే చూస్తున్నారని తెలిపారు.  అందువల్ల పార్లమెంట్‌లో జరిగే చర్చ విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు తొలి అడుగుగా ఉండాలన్నారు. నీట్‌ అంశం తీవ్రత దృష్ట్యా బుధవారం లోక్‌సభలో చర్చకు సులభతరం చేసేలా చూడాలని అభ్యర్థిస్తున్నట్లు లేఖలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని