Rahul Gandhi: విపక్ష నేత పదవి బలమైన ఆయుధం: రాహుల్‌

విపక్ష నేత పదవి అనేది భారతీయుల్లో ప్రతి ఒక్కరికీ బలమైన ప్రజాస్వామ్య ఆయుధమని, ఆ హోదాలో పార్లమెంటులో దేశ ప్రజల వాణిని తాను వినిపిస్తానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చెప్పారు.

Published : 01 Jul 2024 04:33 IST

దిల్లీ: విపక్ష నేత పదవి అనేది భారతీయుల్లో ప్రతి ఒక్కరికీ బలమైన ప్రజాస్వామ్య ఆయుధమని, ఆ హోదాలో పార్లమెంటులో దేశ ప్రజల వాణిని తాను వినిపిస్తానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చెప్పారు. ఆదివారం ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ప్రజల సమస్యలను, వారికి సంబంధించిన ఇతర అంశాలను లేవనెత్తడానికి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని పేర్కొన్నారు. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్న యువతతో తాను మాట్లాడుతుండడం, దానిని లోక్‌సభలో లేవనెత్తడం గురించి వీడియో దృశ్యాలను దీనికి జతచేశారు. కశ్మీర్‌లో మందుపాతర పేలి ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ అజయ్‌సింగ్‌ కుటుంబ సభ్యులతో, మణిపుర్‌ హింసాత్మక ఘటనల బాధితులతో తాను భేటీ అయిన దృశ్యాలను కూడా జతపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని