Raghu RamaKrishna Raju: 50వేలకుపైగా మెజార్టీతో RRR విక్టరీ

భారీ ఆధిక్యంతో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. నర్సాపురం ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన రఘురామ కృష్ణరాజు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు.

Published : 04 Jun 2024 15:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ప్రస్తుతం 30 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా.. మరో 131 స్థానాల్లో కూటమి అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇందులో తెదేపా తరఫున ‘ఉండి’ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘురామ కృష్ణరాజు 56,777 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి పీవీఎల్ నరసింహ రాజుపై ఘన విజయం సాధించారు. ఏలూరులో తెదేపా అభ్యర్థి బడేటి రాధాకృష్ణ 61,261 ఓట్లతో గెలిచారు. వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురంలో జగన్‌ మేనమామ, వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్‌ రెడ్డిపై తెదేపా అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి 20,937 ఓట్లతో విజయం సాధించారు. 

తెదేపాదే కడప

తెదేపా నుంచి ఏలూరులో బడేటి రాధాకృష్ణ, ఆచంట స్థానంలో పితాని సత్యనారాయణ, గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు, చింతలపూడిలో సొంగా రోషన్, బాపట్ల నియోజకవర్గంలో వేగేశ్న నరేంద్రకుమార్‌, కడప స్థానంలో మాధవి రెడ్డి విజయం సాధించారు. మైదుకూరులో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ 20,937 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తాడేపల్లి గూడెంలో 66,039 ఓట్లతో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు