Presidential Election: తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌.. ఓటు వేసిన జగన్‌, కేటీఆర్‌

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. హైదరాబాద్, అమరావతిలోని అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.

Updated : 18 Jul 2022 15:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. హైదరాబాద్, అమరావతిలోని అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్‌, తెలంగాణలో మంత్రి కేటీఆర్‌ తొలి ఓటు వేశారు. మధ్యాహ్నం తర్వాత సీఎం కేసీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మొత్తం పోలింగ్‌ ప్రక్రియను వీడియో తీస్తున్నారు. 

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలోని పోలింగ్‌ కేంద్రంలో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు. వైకాపా తరఫున మంత్రి బుగ్గన, శాసనసభా వ్యవహారాల సమన్వయకర్త, ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 175మంది ఎమ్మెల్యేలు పోలింగ్‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు.. తమ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. వైకాపా, తెదేపాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు వేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర శాసనసభలోనూ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్‌ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తరలి వచ్చారు. తొలి ఓటు హక్కును మంత్రి కేటీఆర్‌ వినియోగించుకోగా.. ఆ తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి తెలంగాణ శాసనసభలో ఓటు వేశారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని