K.Laxman: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొన్నినెలలకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భాజపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.

Published : 04 Jul 2024 03:56 IST

రాజ్యసభలో భాజపా నేత లక్ష్మణ్‌

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొన్నినెలలకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భాజపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ పట్ల ప్రజలు పూర్తి విముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రత్యామ్నాయంగా ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘ మోదీ ప్రభుత్వం గత పదేళ్ల పాలనలో ఒక్క శాతం రిజర్వేషన్లను కూడా తగ్గించలేదు. అలాంటప్పుడు వాటిని రద్దు చేస్తారని మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది’’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని