Pawan kalyan: ఆ ఎమ్మెల్యేలిద్దరినీ విప్‌లుగా ప్రకటించండి: సీఎం చంద్రబాబుకు పవన్‌ లేఖ

తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కోరారు.

Published : 01 Jul 2024 15:33 IST

అమరావతి: తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన లేఖ రాశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను విప్‌లుగా నియమించాలని కోరినట్లు పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు