Palla Srinivasarao: కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తా: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా

తెదేపా ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.

Updated : 28 Jun 2024 17:50 IST

మంగళగిరి: తెదేపా ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని తెలిపారు. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ ఇంతే మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్ని కొట్టివేయిస్తామన్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

పల్లాకు చంద్రబాబు అభినందనలు

తెదేపా ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు యాదవ్‌కి ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌.. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని