OU Student Motilal: నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్‌

ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్‌ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దానిని విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 02 Jul 2024 16:17 IST

 

ఇంటర్నెట్ డెస్క్‌: నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్‌ విరమించారు. తొమ్మిది రోజుల నుంచి ఆయన దీక్ష చేస్తున్నారు. దీక్ష విరమణ అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘తొమ్మిది రోజుల దీక్షలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగమూ పెరగలేదు. అన్న పానీయాలు లేకుండా నిరవధిక దీక్ష చేశా. నా ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నా. దీక్ష చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు పనిచేయని పరిస్థితికి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు. 25 నుంచి 35 ఏళ్ల వయసున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. గ్రూప్‌-1లో 1:100 శాతం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలు పెంచాలి. డీఎస్సీ రద్దు చేసి మెగా డీఎస్సీ ప్రకటించాలి. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు