NVSS Prabhakar: తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం మంచిదే: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం మంచిదేనని భాజపా సీనియర్‌ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు.

Updated : 04 Jul 2024 16:41 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కానుండటం మంచిదేనని భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరు రాష్ట్రాల సీఎంల ‌సమావేశంలో పరిష్కారం కాని ఉమ్మడి సమస్యలు చర్చకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు దాటినా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ యాత్రలు చేయడంతోనే సరిపోతోందని విమర్శించారు. పాలనాపరమైన అంశాలపై ఆయన పట్టు సాధించలేదన్నారు. 

‘‘మంత్రివర్గ విస్తరణ విషయంలో దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇది పాత సంప్రదాయమే. ఆ పార్టీ అధినాయకత్వం ముందరి కాళ్లకు బంధం వేస్తుంది. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ వస్తారని ప్రకటించి ఆ తర్వాత మాట మార్చారు. నలుగురు నాయకుల మధ్య హస్తం పార్టీ ఇరుక్కుంది. హత్యలు, అత్యాచారాలు, అరాచకత్వం పెరిగింది. పాలన పడకేసింది.. ఖజానా ఖాళీ అయింది’’ అని ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని