Congress: దిల్లీ, హరియాణాల్లో వారితో పొత్తు లేనట్లే...! కాంగ్రెస్‌

ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పొత్తుల విషయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 04 Jul 2024 19:54 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) నేతృత్వంలో ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమి (INDIA Bloc)గా ఏర్పడి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాయి. ఇదే ఉత్సాహంతో త్వరలో జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే పొత్తుల విషయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీ, హరియాణాల్లో కాంగ్రెస్‌- ఆప్‌ (AAP)లు కలిసి పోటీచేసే అవకాశం లేదని ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌సీపీ)లతో, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి బరిలోకి దిగుతామని తెలిపారు.

పవిత్రా గౌడను నా భర్త పెళ్లి చేసుకోలేదు: పోలీసులకు దర్శన్‌ భార్య లేఖ

‘‘సార్వత్రిక ఎన్నికల కోసమే ‘ఇండియా’ కూటమి అని గతంలో చెప్పాను. అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఫార్ములా అంటూ ఏదీ లేదు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల పీసీసీలు, కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలు పొత్తుపై నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాయి. పంజాబ్‌లో మా కూటమి లేదు. లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలో ఆప్‌కు ఓ సీటు ఇచ్చాం. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని భావించడం లేదు. దిల్లీలోనూ పొత్తు ఉండదని ఆప్ స్వయంగా చెప్పింది’’ అని జైరాం రమేశ్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయగా.. పంజాబ్‌లో మాత్రం వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని