మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ పగటి కలలు: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

మళ్లీ అధికారంలోకి వస్తామని భారాస అధినేత కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్‌కు చెందిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Published : 28 Jun 2024 14:08 IST

హైదరాబాద్‌: మళ్లీ అధికారంలోకి వస్తామని భారాస అధినేత కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కోరితేనే విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్‌ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అవినీతి బయటపడుతుందనే జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డి కమిషన్‌ ముందు కేసీఆర్‌ హాజరుకాలేదు. దిల్లీ మద్యం కేసు నుంచి తన కుమార్తె కవితను కాపాడుకునేందుకు భాజపాతో ఆయన లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. అధికారంలో ఉండగా రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారు. వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. 

హరీశ్‌రావు మాటలు నమ్మొద్దు.. ఆయన ఎప్పటికైనా భాజపాలోకి వెళ్తారు. ఇప్పటికైనా కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి. నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని రేవంత్‌రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే మా ప్రభుత్వం 30వేల ఉద్యోగాలు ఇచ్చింది. భారాస ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఫాంహౌస్‌కు పిలిచి భోజనాలు పెడితే సరిపోదు. రాజకీయ భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు’’ అని రామ్మోహన్‌రెడ్డి అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని