KTR: ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు: కేటీఆర్‌

భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు.

Published : 03 Jul 2024 12:35 IST

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు భారాస నేతలు భయపడేది లేదన్నారు. జడ్పీ భేటీలో కలెక్టర్‌ స్పందించట్లేదని  కౌశిక్‌రెడ్డి నిరసన తెలిపే యత్నం చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. 

‘‘కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలపై దృష్టి పెట్టట్లేదు. ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేసు పెట్టారు. ఇది దుర్మార్గపూరిత చర్య. ఆ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) కింద పోలీసులు కేసు ఫైల్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని