Congress: కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు

భారాస తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్‌ నాయకుడు కె.కేశవరావు బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Published : 04 Jul 2024 03:54 IST

ఈనాడు, దిల్లీ: భారాస తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్‌ నాయకుడు కె.కేశవరావు బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గతంలోనే భారాసకు రాజీనామా చేసిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతులమీదుగా కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్నారు. కేకే 2006లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005-08 మధ్యకాలంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో పార్టీ అధిష్ఠానం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ 2013 మేలో కాంగ్రెస్‌ను వీడి అప్పటి తెరాసలో చేరారు. 2014లో ఆ పార్టీ తరఫున రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత తెరాస పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశారు. 2020లో మూడోసారి ఎగువసభకు ఎన్నికయ్యారు. 2026 వరకు పదవీకాలం ఉన్నా పార్టీ మారిన నేపథ్యంలో రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆయనకు మళ్లీ రాజ్యసభ అవకాశం కల్పించకపోవచ్చని, రాష్ట్రంలో ముఖ్యమైన పదవి ఇవ్వొచ్చని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని