TG News: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె.కేశవరావు

రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు (కేకే) రాజీనామా చేశారు.

Updated : 04 Jul 2024 17:18 IST

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు (కేకే) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కేకే బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో దిల్లీలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భారాస నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకే.. పార్టీ మారడంతో తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని