Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌ పవర్‌ఫుల్‌ విక్టరీ.. మెజార్టీ ఎంతంటే?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఘన విజయం సాధించారు.

Published : 04 Jun 2024 14:58 IST

పిఠాపురం: ఏపీ ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభంజనం సృష్టించింది. అన్ని ప్రాంతాల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేసింది. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఘన విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి విజయం సాధించారు. మరోవైపు, 21 స్థానాల్లో పోటీచేసిన జనసేన దాదాపు అన్ని సీట్లనూ గెలుచుకొనే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు జనసేన ఏడు సీట్లు గెలుచుకోగా.. 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు