YS Jagan: పిన్నెల్లితో ములాఖత్‌ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్‌

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 4న (గురువారం) నెల్లూరుకు వెళ్లనున్నారు. అక్కడి కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు.

Updated : 03 Jul 2024 07:33 IST

ఈనాడు-అమరావతి, నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 4న (గురువారం) నెల్లూరుకు వెళ్లనున్నారు. అక్కడి కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. మే 13న జరిగిన ఎన్నికల్లో పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుకు వేలు చూపిస్తూ ‘నీ అంతు చూస్తా బయటకు రా’ అని బెదిరించారు. తర్వాత ఆయన అనుచరులు శేషగిరిరావుపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ప్రశ్నించబోయిన మరో మహిళను ‘ఏయ్‌.. జాగ్రత్త’ అంటూ పిన్నెల్లి దుర్భాషలాడారు. పదుల సంఖ్యలో అనుచరులను వెంటబెట్టుకుని పోలింగ్‌ కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేశారు. మరోవైపు డ్యూటీలో ఉన్న కారంపూడి సీఐపై దాడి చేశారు. వీటన్నింటికీ కూడా సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజీలు సాక్ష్యాధారాలుగా ఉన్నాయి. దీంతో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కనీసం ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తిని జగన్‌ జైలుకు వెళ్లి మరీ కలుస్తుండటం చర్చనీయాంశమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని