Vangalapudi anitha: పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్‌ చేసిన ఖర్చు రూ.25 లక్షలు: హోంమంత్రి అనిత

ఈవీఏం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్‌ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు.

Updated : 04 Jul 2024 17:20 IST

అమరావతి: ఈవీఏం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్‌ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్‌లో నెల్లూరు జైలుకు వెళ్లారని చెప్పారు. జైలులో పిన్నెల్లిని కలిసేందుకు ఉన్న ములాఖత్‌లు అయిపోయాయని, మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని తెలిసి కూడా జగన్‌.. ఘర్షణ వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందన్నారు. జైలు నుంచి బయటకొచ్చాక ఆయన ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారన్నారు. ములాఖత్‌లపై జైళ్ల శాఖ ఐజీ నుంచి కూడా నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని హోంమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం తనపై అట్రాసిటీ కేసులు పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామన్నారు. వాటిపై న్యాయపరంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని