Nellore: ‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’

‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్‌ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైకాపాలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు.

Updated : 05 Jul 2024 08:10 IST

లేదు.. మీ వాళ్ల వల్ల్లే సర్వనాశనమైంది
నెల్లూరులో వైకాపా దుస్థితిపై మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సంవాదం 

ఈనాడు, అమరావతి: ‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్‌ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైకాపాలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు. ఎన్నికల్లో వైకాపా బొక్క బోర్లా పడటమే కాకుండా కొన్ని జిల్లాల్లో కూటమి సునామీలో పూర్తిగా కొట్టుకుపోయింది. అలాంటి జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఇక్కడ పార్టీ అంతలా భ్రష్టు పట్టిపోవడంపై... నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద గురువారం వైకాపా నేతల మధ్య చర్చ నడిచింది. జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్‌లో కలిసేందుకోసం జగన్‌ లోపలికి వెళ్లినప్పుడు బయట వేచి ఉన్న తాజా మాజీ మంత్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగిందిలా...

మాజీ మంత్రి: మీ సామాజికవర్గం వారే మా జిల్లాను నాశనం చేశారు.
మాజీ ఎమ్మెల్యే: అంతా మీ వల్లే.. మీరే జిల్లాలో పార్టీని సర్వనాశనం చేశారు. 

మాజీ మంత్రి: నాదేం లేదు, అంతా మీ వాళ్ల వల్లే...
మాజీ ఎమ్మెల్యే: అసలు ఆమెను(ఎన్నికల ముందు వైకాపాను వీడిన మహిళా నాయకురాలిని ఉద్దేశించి) రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం మొదలైంది. 

మాజీ మంత్రి: రాజమాత అంటే అదేమీ తిట్టు కాదు కదా. మీ వాళ్ల వల్లే పార్టీకి ఈ పరిస్థితి. అంతలో జగన్‌ భద్రతా సిబ్బందిలో ఒకరు కలగజేసుకుంటూ..‘ఏమైనా... సార్‌(మాజీ మంత్రిని ఉద్దేశించి) మీ వల్ల ఇబ్బంది మొదలైంది. అందరూ కలిసి పార్టీని ముంచినారు’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని