Narendra modi: నా మిత్రుడు చంద్రబాబుతో కలిసి పని చేస్తా: మోదీ

ప్రధాని మోదీని తెదేపా ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని పలకరించి మాట్లాడారు.

Updated : 26 Jun 2024 21:03 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం దిల్లీలో తెదేపా ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే అయిదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో తెదేపా, భాజపా కలిసి పని చేస్తాయని చెప్పారు. నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పని చేస్తామని ప్రధాని అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని