Hemant Soren: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఝార్ఖండ్‌లో భాజపా మాయం

హవాలా కేసులో తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నిన భాజపా.. ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ విమర్శించారు.

Updated : 30 Jun 2024 06:28 IST

మాజీ సీఎం సోరెన్‌

రాంచీ: హవాలా కేసులో తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నిన భాజపా.. ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ విమర్శించారు. హైకోర్టు మంజూరుచేసిన బెయిలుతో బిర్సాముండా జైలు నుంచి విడుదలైన సోరెన్‌ శనివారం తన నివాసంలో జేఎంఎం కార్యకర్తలతో మాట్లాడారు. తనను జైలుకు పంపించడానికి కుట్రలు పన్నినవారిపై పోరాటం తప్పదని, రాష్ట్ర ప్రజలు భాజపాను విడిచిపెట్టబోరన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తన గుప్పెట పెట్టుకున్న ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా జరపాలని భాజపా ప్రణాళికలు రచిస్తోందని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వారి పగటి కలలు అసంపూర్తిగానే మిగులుతాయన్నారు. ఆ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులకు సీఎం పదవి అని ఆశ పెడుతోందని.. అవకాశమిచ్చినా ఆ నేతలు రబ్బరుస్టాంపు వంటివారేనని సోరెన్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని