Jagan: జగన్‌ కేసులు రోజు వారీ విచారణకు హైకోర్టు ఆదేశం

ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Updated : 03 Jul 2024 19:29 IST

హైదరాబాద్‌: ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉన్న జగన్‌ అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత విచారణకు, ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ సీఎం జగన్‌పై ఉన్న 20 సీబీఐ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయని, త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గతేడాది దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. విచారణలో ఎలాంటి పురోగతి లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా.. రోజు వారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని