TDP: ఏపీ ఎన్నికల ఫలితాలు.. తెదేపాలో హ్యాట్రిక్‌ వీరులు వీళ్లే..

ఏపీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది. 175లో ఏకంగా 166 చోట్ల విజయదుందుభి మోగించింది.

Published : 04 Jun 2024 17:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది. 175లో ఏకంగా 166 చోట్ల విజయదుందుభి మోగించింది. మరోవైపు తెదేపా సొంతంగానే 130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్‌, టెక్కలిలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి పిరియా విజయపై 35 వేలకు పైగా ఆధిక్యంతో అశోక్‌ గెలుపొందగా.. దువ్వాడ శ్రీనివాస్‌ (వైకాపా)పై 32 వేలకు పైగా మెజార్టీతో అచ్చెన్నాయుడు జయకేతనం ఎగురవేశారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ మూడో సారి గెలిచారు. 

వీరితో పాటు నిమ్మకాయల చినరాజప్ప (పెద్దాపురం), గొట్టిపాటి రవి (అద్దంకి), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), గద్దె రామ్మోహన్‌ (విజయవాడ తూర్పు), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి రూరల్‌), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు) హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేశారు. మరోవైపు ఎంపీల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు వరుసగా మూడోసారి గెలిచారు. వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్‌పై విజయదుందుభి మోగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని