Gummadi Sandhya Rani: గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి

ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు.

Updated : 03 Jul 2024 14:47 IST

అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు. గిరిజన పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులతో ఆమె చర్చించారు. డీఎస్సీ నోటిఫికేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతోందంటూ ఉపాధ్యాయులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి.. వారికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు.

గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో గిరిజన ఉపాధ్యాయ, ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం అన్యాయానికి గురి చేసిందని విమర్శించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు. వైకాపా పాలనలో ఏ ఒక్క రోజూ ఉద్యోగుల సమస్యలపై పిలిచి మాట్లాడిన సందర్భం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని