Gottipati Ravi Kumar: ఇలాగే చేస్తే.. క్రికెట్‌ టీం కాస్తా వాలీబాల్‌ టీం అవుతుంది: మంత్రి గొట్టిపాటి

జగన్‌ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయకపోతే క్రికెట్‌ టీం కాస్తా వాలీబాల్‌ టీం అవుతుందని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విరుచుకుపడ్డారు.

Updated : 26 Jun 2024 07:06 IST

ఈనాడు, అమరావతి: జగన్‌ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయకపోతే క్రికెట్‌ టీం కాస్తా వాలీబాల్‌ టీం అవుతుందని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విరుచుకుపడ్డారు. సభాపతిని ఉద్దేశించి మంగళవారం జగన్‌ రాసిన లేఖపై ఆయన మండిపడ్డారు. ‘ప్రజలు జగన్‌ను పాతాళానికి తొక్కేసినా చంద్రబాబు పెద్దమనసుతో ఆయనకు గౌరవం ఇవ్వాలని ఆదేశించారు. అందుకే అర్హత లేకున్నా అసెంబ్లీలో గౌరవం లభించింది. ఆయన వాహనాన్ని లోపలకు అనుమతించారు’ అని వివరించారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి సభాపతిని లక్ష్యంగా చేసుకుని వక్రభాష్యంతో లేఖ రాశారు. బుద్ధి మారలేదని నిరూపించుకున్నారు’ అని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని