GHMC: భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్‌ఎంసీ మేయర్‌

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్‌ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు.

Updated : 06 Jul 2024 13:20 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్‌ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నిరసన తెలిపారు. దీంతో భారాస కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను భారాసనే ప్రోత్సహించిందని మేయర్‌ వ్యాఖ్యానించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశాన్ని కాసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

దాడి చేసుకున్న కార్పొరేటర్లు

కాంగ్రెస్‌, భాజపా కార్పొరేటర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. భాజపా కార్పొరేటర్ శ్రవణ్‌పై కాంగ్రస్‌ కార్పొరేటర్లు దాడి చేశారు. ప్లకార్డుల విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం రేగింది. దీంతో మేయర్‌ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని మళ్లీ వాయిదా వేశారు. తర్వాత మళ్లీ సమావేశం తర్వాత.. వాటర్ వర్క్స్‌ ఎండీని కౌన్సిల్‌కు తీసుకురావాలని కార్పొరేటర్లు పట్టుపట్టారు. అనారోగ్యం కారణంగా ఎండీ అశోక్ రెడ్డి సమావేశానికి రాలేదు. వెంటనే ఆయన్ను పలిపించాలని కమిషనర్‌ను మేయర్‌ ఆదేశించారు. అశోక్‌ రెడ్డితో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఫోన్‌లో మాట్లాడారు. జలమండలి పనితీరుపై భారాస, భాజపా కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని