ప్రతిపక్షంగా తెదేపా విఫలం

ప్రతిపక్ష పాత్ర పోషించడంలో తెదేపా పూర్తిగా విఫలమైందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

Published : 17 Sep 2022 05:37 IST

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిపక్ష పాత్ర పోషించడంలో తెదేపా పూర్తిగా విఫలమైందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు సభకు రాకుండా బయటి నుంచి ఆ పార్టీ సభ్యులకు డైరెక్షన్‌ ఇస్తూ సభను స్తంభింపజేస్తున్నారు. పెద్దల సభలో లోకేశ్‌ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారు. తండ్రి రాకపోతే సభ జరగకూడదనేలా వ్యవహరిస్తున్నారు. గతంలో తెదేపా బాదుడును భరించలేకే జనం ఆ పార్టీని దూరం పెట్టారు. ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ మళ్లీ మొదలుపెట్టారు’ అని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని