ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు

నిరుద్యోగులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని భారాస నేతలు చూస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 10 Jul 2024 03:48 IST

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, న్యూస్‌టుడే: నిరుద్యోగులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని భారాస నేతలు చూస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పార్టీ నేతలతో కలిసి గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ప్రశ్నపత్రాలను లీక్‌ చేసి నిరుద్యోగులను, రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసింది గత భారాస ప్రభుత్వమేనన్నారు. భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతోంటే కేటీఆర్, హరీశ్‌రావు, సురేశ్‌రెడ్డిలకు దిల్లీలో ఏం పని అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ కేటీఆర్‌ దిల్లీలో మీడియాతో మాట్లాడడం చూస్తే జాలేస్తోందన్నారు. అధికారం పోయిన తర్వాత ఆయన తికమకగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ భారాస, భాజపా నేతల మాటలు నమ్మి ఆగం కావొద్దని నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని