వైకాపాలో నియోజకవర్గాల బాధ్యుల మార్పు షురూ

ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన వైకాపాలో ఇప్పుడు నియోజకవర్గాల బాధ్యుల మార్పులు మొదలయ్యాయి.

Published : 07 Jul 2024 05:27 IST

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన వైకాపాలో ఇప్పుడు నియోజకవర్గాల బాధ్యుల మార్పులు మొదలయ్యాయి. పెనమలూరు నుంచి పోటీచేసిన మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్కడి నుంచి తప్పించారు. ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిని నియమించారు. జోగి రమేష్‌ ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆయన సొంత నియోజకవర్గం మైలవరానికి మార్చినట్లు తెలిసింది. పులివెందుల పర్యటనకు వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికేందుకు వచ్చిన జోగి రమేష్, చక్రవర్తిలకు జగన్‌ ఈ విషయం చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతోందని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని