Dwarampudi Chandrasekhar reddy: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు

కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో గురువారం కేసు నమోదుచేశారు.

Published : 05 Jul 2024 08:33 IST

అక్రమ నిర్మాణం కూల్చివేత సందర్భంగా వీరంగం

కాకినాడ కలెక్టరేట్, మసీదు సెంటర్, న్యూస్‌టుడే: కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో గురువారం కేసు నమోదుచేశారు. ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్‌లో వైకాపా నాయకుడు సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని వీరందరిపై అధికారులు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన అనుచరులతో వచ్చి గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ద్వారంపూడి ప్రోద్బలంతో వైకాపా కార్యకర్తలు మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఏ2గా  బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వర్‌ నాయక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని